బైక్‌పై గుడికి వెళ్తున్న ఇద్దరు యువకులు.. ఇంతలో వారికి ఎదురొచ్చిన పులి.. దాన్ని చూసి వాళ్లేం చేశారో మీరే చూడండి

ABN , First Publish Date - 2022-02-13T21:21:53+05:30 IST

ఇద్దరు యువకులు దైవ దర్శనానికని బైక్‌పై బయల్దేరారు. మార్గ మధ్యంలో వారికి ఓ పులి ఎదురుపడింది. దాన్ని చూసిన యువకులు భయంతో వణికిపోయారు. వెంటనే బైక్‌ను పక్కన పడేశారు. ఆ తర్వాత వాళ్లు చేసిన

బైక్‌పై గుడికి వెళ్తున్న ఇద్దరు యువకులు.. ఇంతలో వారికి ఎదురొచ్చిన పులి.. దాన్ని చూసి వాళ్లేం చేశారో మీరే చూడండి

ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరు యువకులు దైవ దర్శనానికని బైక్‌పై బయల్దేరారు. మార్గ మధ్యంలో వారికి ఓ పులి ఎదురుపడింది. దాన్ని చూసిన యువకులు భయంతో వణికిపోయారు. వెంటనే బైక్‌ను పక్కన పడేశారు. ఆ తర్వాత వాళ్లు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని అడవుల్లో పులుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా మధ్యప్రదేశ్‌ను టైగర్ స్టేట్ అని కూడా అంటుంటారు. కాగా.. ఆ అడవుల్లోకి దేవుడి దర్శనం కోసం వెళ్లిన ఇద్దరు యువకులు పులి బారి నుంచి కొద్దిలో తప్పించుకున్నారు. పన్న టైగర్ రిజర్వ్‌లోని ఝలారియా మహాదేవ్ టెంపుల్ చాలా ఫేమస్. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు పన్న టైగర్ రిజర్వ్ గుండా ఝలారియా మహాదేవ్ ఆలయానికి వెళ్తున్నారు. ఇంతలో వారికి ఓ పెద్ద పులి ఎదురైంది. దాన్ని చూసిన వెంటనే ఆ యువకులు భయాందోళనలకు గురయ్యారు. బైక్‌ను పక్కన పడేసి, పరుగులు తీశారు. అనంతరం అక్కడే ఉన్న ఓ పెద్ద చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. కారులో అటువైపు వచ్చిన కొందరు ప్రయాణికులు ఈ దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది.



Updated Date - 2022-02-13T21:21:53+05:30 IST