May 17 2021 @ 15:50PM

మ్యూజిక్‌ మిసైల్‌ ఫొటో మ్యాజిక్‌!

గత ఏడాది లాక్‌డౌన్‌లో ఏం నేర్చుకున్నారు అంటే వృత్తి పరంగా, వ్యక్తి పరంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాని చెప్పారు మ్యూజిక్‌ మిసైల్‌ దేవిశ్రీ ప్రసాద్‌. అలాగే టెక్నీకల్‌గా కూడా ఆయన ఎన్నో విషయాలపై దృష్టి సారించారు. అందులో ఫొటోగ్రఫీ ఒకటి. స్టిల్‌ కెమెరా పట్టుకుని రాక్‌స్టార్‌ పకృతి అందాలను కెమెరాలో బంధిస్తున్నారు. సంగీతంతో మ్యాజిక్‌ చేయడమే కాదు ఫొటోలతో ఆయన మ్యాజిక్‌ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన ఎన్నో ఫొటోలు చిత్రీకరించారు. అయితే ఆదివారం ఆకాశంలో చంద్రుడు, ఆ వెనకున్న శివుడి రూపంలో ఉన్న ఫొటో తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘‘ఆకాశంలో శివుడు. కరోనా మహమ్మారి నుంచి కాపాడటానికి వస్తున్నాడు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్‌ మీడయాలో వైరల్‌  అవుతోంది. ప్రస్తుతం ఆయన ‘గుడ్‌లక్‌ సఖి’, ‘పుష్ప’, ‘ఖిలాడి’, ‘ఎఫ్‌3’, ‘పవన్‌కల్యాణ్‌ 28’, ‘రాపో19’, ‘రౌడీబాయ్స్‌’ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.