బూతుల మంత్రిని బర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-01-22T06:18:28+05:30 IST

బూతుల మంత్రిని బర్తరఫ్‌ చేయాలి

బూతుల మంత్రిని బర్తరఫ్‌ చేయాలి

ట్విటర్‌లో మాజీమంత్రి దేవినేని ఉమా 

గొల్లపూడి, జనవరి 21 : గుడివాడలో బొండా ఉమా కారుపై దాడిని, టీడీపీ సభ్యుల అరెస్టును టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం ట్విటర్‌లో ఖండించారు. అక్రమ సంపాదన గుట్టు బయట పడటంతో కేసినో మంత్రి అసహనంతో బూతులు మాట్లాడుతున్నాడన్నారు. బూతుల మంత్రిని వెంటనే కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసి అరెస్టు చేయాలని ట్విటర్‌ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-01-22T06:18:28+05:30 IST