Abn logo
Sep 21 2020 @ 11:47AM

ఏం తేల్చారో ప్రజలకు చెప్పండి: దేవినేని

Kaakateeya

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఆర్డీయే ఉనికిలోకి రాకముందు జరిగిన లావాదేవీలను ఇన్ సైడర్ ఖాతాలోకి వేస్తారు. రాజధానికి సుదూరంగా భూములు కొన్నా అక్రమమేనంట. మరి విశాఖ చుట్టూ వైసీపీ కొనుగోళ్లను ఏమంటారు?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని దేవినేని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం నాడు ఆయన ట్వీట్ చేశారు. సర్కారువారి ఇన్‌సైడర్ ట్రేడింగ్ డ్రామాలో ఉపసంఘం శోధించి తేల్చిందేమిటో ప్రజలకు చెప్పాలని సీఎం జగన్‌ను ఆయన డిమాండ్ చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నివేదికను తయారు చేశారని దేవినేని ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement