జేట్యాక్స్‌ కట్టే లిక్కర్‌ కంపెనీలకే అనుమతులు ఇచ్చారు: ఉమ

ABN , First Publish Date - 2020-02-16T23:47:20+05:30 IST

విశాఖలో ఆరున్నర ఎకరాల ఆశ్రమంపై ఎంపీ విజయసాయిరెడ్డి కన్నుపడిందని, ఆశ్రమ నిర్వాహకులను బెదిరిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు.

జేట్యాక్స్‌ కట్టే లిక్కర్‌ కంపెనీలకే అనుమతులు ఇచ్చారు: ఉమ

విజయవాడ: విశాఖలో ఆరున్నర ఎకరాల ఆశ్రమంపై ఎంపీ విజయసాయిరెడ్డి కన్నుపడిందని, ఆశ్రమ నిర్వాహకులను బెదిరిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. 61 రోజులుగా రైతులు, మహిళలు ఉద్యమం చేస్తుంటే.. ఒక్కసారైనా సాక్షి పత్రికలో రాశారా అని ప్రశ్నించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా అక్రమ కేసులు పెడుతున్నారని, జర్నలిస్టులకు కూడా కులాలు ఆపాదించి కేసులు పెట్టారని మండిపడ్డారు. రైతుల పేరు మీద పందికొక్కుల్లా దోపిడీ చేస్తున్నారని, వైసీపీ మంత్రులు, ఎంపీలు ఇసుక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. జేట్యాక్స్‌ కట్టే లిక్కర్‌ కంపెనీలకే అనుమతులు ఇచ్చారని ఉమ తెలిపారు.

Updated Date - 2020-02-16T23:47:20+05:30 IST