ఎన్టీఆర్ (NTR) జిల్లా: తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Deveneni Uma) జి.కొండూరు మండలంలో పాదయాత్ర (Padayatra) చేపట్టారు. రాష్ట్రంలో రహదారుల దుస్థితిని ప్రభుత్వానికి తెలిపేందుకు దుగ్గిరాల పాడు గ్రామం నుంచి జి.కొండూరు వరకు పాదయాత్ర ప్రారంభించారు. దుగ్గిరాల పాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. దేవినేని ఉమా పాదయాత్రకు మద్దతుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మొహరించారు. పాదయాత్ర జరిగే గ్రామాల్లో పోలీసులు పీకేటింగ్ ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి