Abn logo
May 9 2021 @ 14:52PM

సీఎం జగన్‌పై దేవినేని ఉమా ఫైర్

అమరావతి: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై మాజీ మంత్రి తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమా ట్విట్టర్‌ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రజలు కరోనాతో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.  ఆస్పత్రుల ఎదుట వాహనాల్లో పడిగాపులు.. పడకలు లేక పాట్లు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  నో స్టాక్ బోర్డులతో ఎండల్లో టీకాల కోసం ప్రజల బాధ వర్ణనాతీతమని చెప్పారు. ప్రజలు పడేబాధలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కోటికిపైగా వాక్సిన్లు ఆర్డర్ పెట్టారన్నారు. వాక్సిన్ల కోసం ఏపీ ఎంత ఆర్డర్ పెట్టిందో చెప్పాలని ట్విట్టర్‌లో దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ప్రజలకు రక్షణ చర్యలు చేపట్టాలని  దేవినేని ఉమా ట్వీట్ చేశారు.