రెండున్నరేళ్లలో ఎన్ని పనులు చేశారో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2022-02-11T17:55:21+05:30 IST

రెండున్నరేళ్లలో ఎన్ని పనులు చేశారో సీఎం జగన్, మంత్రి అనిల్ శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?..

రెండున్నరేళ్లలో ఎన్ని పనులు చేశారో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా?: దేవినేని ఉమ

నెల్లూరు: రెండున్నరేళ్లలో ఎన్ని పనులు చేశారో సీఎం జగన్, మంత్రి అనిల్ శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. మంత్రి సొంత జిల్లాలో సోమశిల డ్యామ్‌కు మరమ్మతులు చేపట్టలేదని, నెల్లూరు, సంగం బ్యేరేజు పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు. సెంటు స్థలాల పేరుతో పెన్నానదిలో ఇసుకను దోచారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. 


శుక్రవారం నెల్లూరు పర్యటనకు వచ్చిన దేవినేని ఉమ మహేశ్వరరావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో రూ. 67వేల కోట్లు ఇరిగేషన్ విభాగంలో ఖర్చు చేశామన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలన్నారు. వంశధార ఫేజ్-2 పనులు పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. పోలవరం పనులు నిలిచిపోయాయన్నారు. టీడీపీ హయాంలో 71 శాతం పోలవరం పనులు పూర్తి చేశామన్నారు. 33 నెలల్లో వైసీపీ ఢిల్లీలో ఏం సాధించింది.. రాష్ట్రంలో ఏం అభివృద్ది చేసింది.. ముఖ్యమంత్రి జగన్, మంత్రి అనిల్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

Updated Date - 2022-02-11T17:55:21+05:30 IST