కొడాలి నానిని పశువులతో కూడా పోల్చలేం: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-01-20T00:17:56+05:30 IST

మంత్రి కొడాలి నాని చేసిన సవాల్‌ను స్వీకరించిన మాజీ మంత్రి దేవినేని ఉమ మంగళవారం ఉదయం దీక్షకు దేవినేని ఉమ దీక్షకు దిగారు. ఈ దీక్షకు అనుమతి లేదంటూ ....

కొడాలి నానిని పశువులతో కూడా పోల్చలేం: దేవినేని ఉమ

విజయవాడ: మంత్రి కొడాలి నాని చేసిన సవాల్‌ను స్వీకరించిన మాజీ మంత్రి దేవినేని ఉమ గొల్లపూడి సెంటర్‌లో మంగళవారం ఉదయం దీక్షకు దిగారు. ఈ దీక్షకు అనుమతి లేదంటూ దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకుని ఈ సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానిపై దేవినేని ఉమ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బూతుల మంత్రి కొడాలి నాని ఇప్పుడు పోరంబోకు మంత్రి అయ్యాడని విమర్శించారు. కొడాలి నానికి చదువు లేదని.. సంస్కారం లేదని ఎద్దేవా చేశారు. కొడాలి నానిని పశువులతో కూడా పోల్చలేమన్నారు. జగన్‌ ఎవరి కాళ్లు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లారని ప్రశ్నించారు. డిబేట్‌కి స్పెల్లింగ్ తెలియని వారితో నేను చర్చించేది ఏంటని వ్యాఖ్యానించారు. ఆ స్థాయి కొడాలి నానికి ఉందా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. 


Updated Date - 2021-01-20T00:17:56+05:30 IST