Devineni Uma: కమీషన్ల కక్కుర్తితో పోలవరాన్ని ప్రశ్నార్ధకం చేశారు: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2022-08-17T17:30:44+05:30 IST

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

Devineni Uma: కమీషన్ల కక్కుర్తితో పోలవరాన్ని ప్రశ్నార్ధకం చేశారు: దేవినేని ఉమ

అమరావతి (Amaravathi): జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy) ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswararao) ట్విట్టర్ (Twitter) వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కమీషన్ల కక్కుర్తితో పోలవరాన్ని (Polavaram) ప్రశ్నార్ధకం చేశారని విమర్శించారు. శరవేగంగా జరుగుతున్న పనులను రివర్స్ టెండరింగ్ (Reverse tendering) పేరుతో అర్ధాంతరంగా ఆపేశారని మండిపడ్డారు. కేంద్రం హెచ్చరించినా లెక్కచేయలేదన్నారు. టీఏసీ (TAC)లో 2019లోనే చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) రూ. 55,548 కోట్లకు ఆమోదం తెస్తే.. 31 మంది ఎంపీలు ఉండి 39 నెలల్లో ఏం చేశారో సీఎం జగన్ జాతికి సమాధానం చెప్పాలని  దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-17T17:30:44+05:30 IST