Abn logo
Oct 14 2021 @ 11:54AM

ప్రభుత్వ లెక్కల్లో కనిపించని లక్షా31వేల కోట్లు: దేవినేని ఉమ

అమరావతి: ప్రభుత్వ లెక్కల్లో రూ. లక్షా 31 వేల కోట్లు కనిపించడంలేదని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా నిధుల మళ్లింపుతో లెక్కల్లో గోల్మాల్ చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎక్కడ, ఏ విధంగా ఖర్చు చేసిందో ఎవరికీ తెలియదన్నారు. మాయమైన సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని ప్రశ్నించారు. ఆదాయం, అప్పులు, ఖర్చుల లెక్కలపై శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.