ఎన్టీఆర్: గొల్లపూడి నుండి ఆర్టీసీ పల్లె వెలుగులో మైలవరం వరకు మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రయాణం చేశారు. జగన్ రెడ్డి రివర్స్ పాలనలో సామాన్యుడి వాహనం ధరలకు రెక్కలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. ఒకవైపు ప్రజాధనం వృధా, దోపిడి మరోవైపు ధరల పెంపుతో ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి హయంలో మూడేళ్లలో నాలుగు సార్లు ఆర్టీసీ చార్జీలు పెరిగాయన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో 2,175 కోట్లు ప్రజలపై భారం పడుతోందన్నారు. మూడేళ్లలో నాలుగు సార్లు పెరిగిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా విజయవాడ (గొల్లపూడి) నుండి మైలవరం వరకు పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తూ.. జగన్ రెడ్డి బాదుడుతో ప్రయాణికుల కష్టాలను ఆయన తెలుసుకున్నారు.