అమరావతి: విపత్తు సమయాల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. వరద బాధితులను సీఎం జగన్‌రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తులు, తుఫాన్ల సమయంలో చంద్రబాబు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారని ఆయన గుర్తుచేశారు. సొంత జిల్లానే ముంచేసిన జగన్‌రెడ్డికి సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. మున్సిపల్ ఎన్నికలకు 3 రోజుల ముందే దొంగ ఓటర్లను ఇళ్లల్లో దాచిన జగన్‌రెడ్డి.. వర్షాలు, వరదలపై ముందే హెచ్చరికలు ఎందుకు జారీ చేయలేదు? అని ప్రశ్నించారు. ఇదంతా జగన్‌రెడ్డి చేతగానితనం కాదా? అని ప్రశ్నించారు.