అమరావతి: అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జ్‌ను మాజీ మంత్రి దేవినేని ఉమా ఖండించారు. పాఠశాలను కాపాడుకోవడానికి ఉద్యమిస్తే రక్తంచిందేలా కొడతారా? అని ప్రశ్నించారు. ప్రశ్నించారని విద్యార్థినీలపై దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. విద్యార్థులు చిందించిన రక్తపుబొట్టు ప్రభుత్వ పతనానికి నాంది కాబోతుందని ఆయన ధ్వజమెత్తారు.