Abn logo
Jul 31 2021 @ 03:17AM

దేవినేని ఉమను కస్టడీకి ఇవ్వండి

మచిలీపట్నం ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోలీసుల పిటిషన్‌


విజయవాడ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మచిలీపట్నంలోని ఎస్సీ, ఎస్టీ (పదో అదనపు జిల్లా జడ్జి) కోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలుచేశారు. దీనిపై విచారణను న్యాయమూర్తి శనివారానికి వాయిదా వేశారు.

దేవినేనితో టీడీపీ నేతల ములాఖత్‌కు నో


రాజమహేంద్రవరం సిటీ, జూలై 30: దేవినేని ఉమను కలిసేందుకు వచ్చిన టీడీపీ నేతలకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పలువురు టీడీపీ నేతలు శుక్రవారం జైలుకు రాగా.. కరోనా నిబంధనల నేపథ్యంలో ములాఖత్‌కు అవకాశం ఇవ్వలేదు.