బిగ్‌బాష్‌ లీగ్‌కు డివిల్లీర్స్‌ దూరం

ABN , First Publish Date - 2020-10-28T09:11:00+05:30 IST

దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిల్లీర్స్‌ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)కు అందుబాటులో ఉండడం

బిగ్‌బాష్‌ లీగ్‌కు డివిల్లీర్స్‌ దూరం

దుబాయ్‌: దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిల్లీర్స్‌ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)కు అందుబాటులో ఉండడం లేదు. కొద్ది రోజుల్లో అతని భార్య డేనియల్‌ స్వార్ట్‌ మూడో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో బీబీఎల్‌ నుంచి తప్పుకొంటున్నట్టు డివిల్లీర్స్‌ తెలిపాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఆధ్వర్యంలో డిసెంబరు 3 నుంచి ఫిబ్రవరి 6 వరకు బీబీఎల్‌ జరగనుంది. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌లో బెంగళూరుకు ఏబీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2020-10-28T09:11:00+05:30 IST