Abn logo
Mar 29 2020 @ 14:56PM

స‌ల్మాన్‌కు దేవిశ్రీ ట్యూన్‌

టాలీవుడ్ మ్యూజిక‌ల్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ప‌లువురు బాలీవుడ్ చిత్రాల‌కు ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో బాలీవుడ్ సినిమాకు ఓ సాంగ్‌ను కంపోజ్ చేశాడ‌ట దేవిశ్రీ. ఆ చిత్ర‌మేదో కాదు స‌ల్మాన్‌ఖాన్ హీరోగా న‌టిస్తో్న్న ‘రాధే’. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ పెప్పీ సాంగ్ అవ‌స‌ర‌మైంది. ఆ స‌మ‌యంలో దేవిశ్రీ ప్ర‌సాద్ అయితే బావుంటుంద‌ని స‌ల్మాన్‌ఖాన్‌కు ప్ర‌భుదేవా సూచించాడ‌ట‌. స‌ల్మాన్ కూడా ఓకే అన్నాడ‌ట‌. దేవిశ్రీ ప్ర‌సాద్‌తో పాటు హిమేష్ రేష్మియా, సాజిద్‌-వాజిద్‌లు కూడా ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నార‌ట‌. ఈ ఏడాది ఈద్‌కు ఈ సినిమా విడుద‌ల‌వుతుద‌ని ప్ర‌క‌టించారు. మ‌రి.. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంగా వాయిదా ప‌డుతుందో లేక చెప్పిన టైమ్‌కు రాధే థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తాడో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement