Telangana: అమిత్‌షా వ్యాఖ్యలను ఖండించిన తూడి దేవేందర్ రెడ్డి

ABN , First Publish Date - 2022-05-16T00:05:43+05:30 IST

అమిత్‌షా తెలంగాణ రాష్ట్రం తుక్కుగుడలో చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి ఖండించారు. మైనార్టీ రిజర్వేషన్లు తొలగిస్తామని అమిత్‌షా

Telangana: అమిత్‌షా వ్యాఖ్యలను ఖండించిన తూడి దేవేందర్ రెడ్డి

తెలంగాణ: అమిత్‌షా (Amit sha) తెలంగాణ రాష్ట్రం తుక్కుగుడలో చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి (Devender Reddy) ఖండించారు. మైనార్టీ రిజర్వేషన్లు తొలగిస్తామని అమిత్‌షా పేర్కొనడంపై ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో వారు చదువుల్లో, ఉద్యోగాల్లో రాణించాలని తెలిపారు. కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్‌షా రిజర్వేషన్ల మీద రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరికాదన్నారు. వీలైతే రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేయాలని సూచించారు. అధికారం కోసం బీజేపీ ప్రజలను మతాల వారీగా విడగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. బిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న తెలంగాణలో బీజేపీ అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలకు తావివ్వకూడదని ప్రజలను కోరారు.  అన్నదాతల కష్టాలు పట్టని బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతులకు ఏ కష్టం రానివ్వమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  

Updated Date - 2022-05-16T00:05:43+05:30 IST