అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-07-06T06:02:33+05:30 IST

అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ అన్నారు.

అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌

జగిత్యాల టౌన్‌,  జూలై 5:  అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో రూ. 4.5 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ఇంటి గ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను మంగళవారం అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్‌కు సూ చించారు. అనంతరం గొల్లపల్లి రోడ్‌, బైపాస్‌ రహదారిలో అభివృధ్ది పను లను పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా పారిశుద్ద పను లను మరింత మెరుగుపరచాలన్నారు. కమిషనర్‌ స్వరూప రాణి, డీఈ రాజేశ్వర్‌ , టీపీఎస్‌ శ్యాం సుందర్‌ ఉన్నారు.

బైపాస్‌ రహదారికి మరమ్మతులు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్‌ రహదారి ఇటీవల కురిసిన వర్షానికి గుంతలమయం కావడంతో ప్రయాణీ కులు ఇబ్బందుల దృష్ట్యా మరమ్మతులు చేపట్టారు. జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి మంగళ వారం బైపాస్‌ రహదారిని పరిశీలించారు. గుంతలమ యమైన రహదారులను మట్టితో పూడ్పించారు. కౌన్సిలర్లు గుగ్గిల్ల హరీష్‌, కొలగాని ప్రేమ లత తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-07-06T06:02:33+05:30 IST