పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించాలి

ABN , First Publish Date - 2022-05-28T05:25:57+05:30 IST

గ్రౌండింగ్‌లో ఉన్న జాప్యం లేకుండా పాఠశాలల్లో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశిం చారు.

పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించాలి
వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ 

పెద్దపల్లి కల్చరల్‌, మే 27 : గ్రౌండింగ్‌లో ఉన్న జాప్యం లేకుండా పాఠశాలల్లో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. మన ఊరు-మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్‌ శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో మొదటి దశలో 191 పాఠశాలల్లో మన ఊరు-మన బడి కింద ఎంపిక చేయగా, ఇప్పటివరకు 140 పాఠశాలల పనులకు పరిపాలన అనుమతులు, 108 పాఠశాలలకు సాంకేతిక అనుమతులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. జిల్లాలో 189 పాఠశాలలో రూ.35.91 కోట్ల అంచనాతో 706 పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు ఇంజనీరింగ్‌ అధికారులు తయారు చేశారని కలెక్టర్‌ అన్నారు. జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో అధిక ప్రతి పాధనలు గల కారణాలను మండలాల వారిగా కలెక్టర్‌ సమీక్షిం చారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ ఈఈ ప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ డీఈ రాములు, ఈడీఎం కవిత, సంబంధిత అధికా రులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-28T05:25:57+05:30 IST