అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-10-21T06:23:10+05:30 IST

జిల్లాలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, మిషన్‌భగీరథ తదితర ఇంజనీరింగ్‌ విభాగాల్లో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులపై సమీక్షించారు.

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
సమీక్షిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

 - జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, మిషన్‌భగీరథ తదితర ఇంజనీరింగ్‌ విభాగాల్లో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లు, ఇతర మరమ్మతు పనులు చేపట్టడానికి అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను తాత్కాలికంగా తొలగించాలని, విద్యుత్‌ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సెస్‌ అధికారులను ఆదేశించారు. సెస్‌ మండల కేంద్రంలో 1.5 కిలోమీటర్ల మేరకు ఫోర్‌లైన్‌ రహదారిని నిర్మించే అంశంపై నివేదిక సమర్పించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు మిషన్‌భగీరథ నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అటవీ భూముల సమస్య ఉన్నచోట సమావేశాలు నిర్వహించి  పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.   సమావేశంలో జిల్లా పంచాయతీ రాజ్‌ ఈఈ శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ కిషన్‌రావు, మిషన్‌భగీరథ గ్రిడ్‌ ఈఈ విజయ్‌కుమార్‌, ఇట్రా ఈఈ జానకి, డీఈవో రాధాకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T06:23:10+05:30 IST