అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-07-01T05:36:01+05:30 IST

‘మన ఊరు, మన బడి’లో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ యాస్మిన్‌బాషా అధికారులను ఆదే శించారు.

అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి
పాఠశాల ఆవరణలో మొక్క నాటి, నీరు పోస్తున్న కలెక్టర్‌ యాస్మిన్‌బాషా

- కలెక్టర్‌ యాస్మిన్‌బాషా 

- ‘మన ఊరు, మనబడి’ పాఠశాలల పరిశీలన 

  

వనపర్తి రూరల్‌, జూన్‌ 30: ‘మన ఊరు, మన బడి’లో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ యాస్మిన్‌బాషా అధికారులను ఆదే శించారు. గురువారం వనపర్తి మండలంలోని అచ్యుతా పురం గ్రామంలో మన ఊరు, మన బడి కింద ఎన్ని కైన పాఠశాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకునేలా చూడాలని ప్రధానోపాధ్యాయు డికి సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్‌ యూనిఫామ్‌, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందేలా చూసుకోవాలని, గ్రామ ప్రజా ప్రతినిధులు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ పాఠశాల ఆవ రణలో మొక్క నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్‌, ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్‌, ఏఈ సంతోష్‌కుమార్‌, సర్పంచ్‌ శారద, కార్యదర్శి రత్నమాల, మాజీ ఉప స ర్పంచ్‌ పాపిరెడ్డి, బాలయ్య, శ్రీనివాసులు, రైతు సమన్వయ కోఆర్డినేటర్‌ విష్ణువర్దన్‌రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. 

 కార్యక్రమాల అమలులో జాప్యం చేయొద్దు..

వనపర్తి అర్బన్‌ : ప్రభుత్వం అమలుచేస్తున్న ‘మన ఊరు, మన బడి’, తెలంగాణకు హరితహారం కార్యక్ర మాల పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నూతన సమీకృత కలెక్టరేట్‌ లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ హరితహారం, పాఠశాలల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వనపర్తి జి ల్లాలో 183 పాఠశాలలను గుర్తించడం జరిగిందని, ప్ర భుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మన ఊరు, మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ.30లక్షల లోపు పనులను జా ప్యం లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు, ప్రత్యేక అధికారులు, ఎం ఈవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T05:36:01+05:30 IST