నీరు, పరిశ్రమలతోనే అభివృద్ధి

ABN , First Publish Date - 2021-10-24T05:37:56+05:30 IST

తరతరాలుగా వెనుకబాటుకు గురైన రాయలసీమ అభివృద్ధి చెందాలంటే నీరు, పరిశ్రమలతో పాటుగా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని శాసనమండలి ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు.

నీరు, పరిశ్రమలతోనే అభివృద్ధి
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం

పోరాటాలతోనే హక్కులు సాఽఽధించుకోగలం

శాసనమండలి ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం

కడప (మారుతీనగర్‌), అక్టోబరు 23: తరతరాలుగా వెనుకబాటుకు గురైన రాయలసీమ అభివృద్ధి చెందాలంటే నీరు, పరిశ్రమలతో పాటుగా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని శాసనమండలి ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు.    సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వెనుకబడిన ప్రాంతం అభివృద్ధిపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాయలసీమలో సరైన విద్యాసంస్థలు లేక ఇక్కడి విద్యార్థులు ఎక్కువగా విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్తున్నారని అన్నారు. కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పడమే కానీ ఇంతవరకూ అతీగతీ లేదన్నారు. ముఖ్యంగా కేంద్రప్రభుత్వం ఆద్వర్యంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుచేస్తే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల పోస్టుల భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలమన్నారు. అందుకు సీమ ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు నారాయణ, జిల్లాకార్యదర్శి జి.చంద్రశేఖర్‌, నగర అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:37:56+05:30 IST