Abn logo
Aug 2 2020 @ 05:01AM

మూడు రాజధానులతోనే అభివృద్ధి

మంత్రి శంకరనారాయణ


పెనుకొండ, ఆగస్టు 1: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని, అందులో భాగమే మూడు రాజధానుల ఏర్పాటని రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు.   రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శనివారం ఆయన పట్టణంలోని వైఎస్సార్‌ కూడలి వద్ద  వైసీపీ శ్రేణులతో కలిసి వైఎస్‌  విగ్రహానికి పాలాభిషేకం చేశారు.  అనంతరం మాట్లాడుతూ  గవర్నర్‌ ఆమోద ముద్రతో ప్రజల అభీష్టం నెరవేరిందన్నారు.   కార్యక్రమంలో నాయకులు సుధాకరరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రామ్మోహనరెడ్డి, అయూబ్‌, శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


కదిరి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే మూడు రాజధానులు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి శనివారం ఆయన పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమను సమానంగా అభివృద్ధి చేయడానికే విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ కిన్నెర కల్యాణ్‌, వైసీపీ నాయకులు రాజశేఖర్‌రెడి బాహుద్దీన్‌, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 


అనంతపురంరూరల్‌ : వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని రాప్తాడు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ నాగేశ్వర్‌రె డ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వైఎస్‌ విగ్రహానికి, రాష్ట్రముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల యూ త్‌ కన్వీనర్‌ కె.శ్రీనివాసులు, జడ్పీటిసీ అభ్యర్థి చంద్రకుమా ర్‌, నాయకులు వడ్డే శ్రీనివాసులు, గిరిజమ్మ, గుగ్గిళ్ల క్రిష్ణరెడ్డి, శ్యామ్‌సుందర్‌శాస్త్రీ, శివ, ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.


ఉరవకొండ : రాష్ట్ర పరిపాలన, వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంపై వైసీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పట్టణంలో శనివారం వైఎ్‌సఆర్‌ విగ్రహానికి పాలతో అభిషేకించారు. కార్యక్రమంలో శ్రీనాథ్‌ రెడ్డి, ఎర్రిస్వామి పాల్గొన్నారు.


గుంతకల్లుటౌన్‌ : మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు రద్దుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంపై వైసీపీ నాయకులు శనివారం సంబరాలు చేసుకున్నారు. వైఎ్‌సఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో రామలింగప్ప, భీమలింగప్ప, నూర్‌ నిజామి పాల్గొన్నారు.


శింగనమల : పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు అమోదం తెలపడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. రాజశేఖర్‌రెడ్డి విగహ్రానికి రాష్ట్ర విద్యాసంస్కరణ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి ఆధ్యర్యంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నగే్‌ష,శివశంకర్‌రెడ్డి, నాగవర్ధన్‌రెడ్డి, ఎల్‌.రాజు, లక్ష్మినారాయణరెడ్డి పాల్గొన్నారు.


గుత్తి: గుత్తి, గుత్తిఆర్‌ఎస్‌ పట్టణంలో మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లురద్దుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంపై వైసీపీ నాయకులు శనివారం సంబరాలు చేసుకున్నారు.  వైఎ్‌సఆర్‌  విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. కార్యక్రమంలో రంగస్వామి, కొనకొండ్ల సూరి, సామెల్‌, సునీల్‌, హరి, వలి, పాల్గొన్నారు. కర్నూలును జుడిషియల్‌ రాజధానిగా ప్రకటించినందుకు స్థానిక బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్దయక్షుడు మనోహర్‌, పీడీ రత్నం, నిర్మలారెడ్డి, భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement