అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల గురించి ఆలోచించడం లేదన్నారు. ఏపీని ప్రపంచ దేశాల్లో చిన్నచూపు చూసేలా చేశారని తెలిపారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి