అభివృద్ధి.. ఆరేళ్లు

ABN , First Publish Date - 2020-06-02T09:29:40+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టుతో సూర్యాపేట జిల్లాలో చెరువులకు జలకళ సంతరించుకుంది. జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ

అభివృద్ధి.. ఆరేళ్లు

చెరువులకు జలకళ


సూర్యాపేట, జూన్‌ 1  (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుతో సూర్యాపేట జిల్లాలో చెరువులకు జలకళ సంతరించుకుంది. జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో చెరువులను వేసవికి ముందే నింపారు. ప్రస్తుతం ఎండాకాలంలో సైం చెరువుల్లో నీరు ఉంది. భూగర్భజలాలు సమృద్ధిగా ఉండటంతో వరి సాగు గతం కంటే గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో  సూర్యాపేట జిల్లాకు శ్రీరాంసాగర్‌ రెండో దశ నీటి విడుదలతో జిల్లాలోని అన్ని చెరువులు మూడు నెలల క్రితమే నింపారు. రెండో దశలో 2లక్షల 10వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉండగా, కేవలం చెరువులు నింపడం ద్వారానే 3లక్షల 50వేల ఎకరాలు సాగుచేశారు. ప్రధానంగా వరి సాగు గతంలో యాసంగి సీజన్‌లో లక్షా 60వేల ఎకరాలకు పరిమితం కాగా ప్రస్తుతం 3లక్షల 8 వేల ఎకరాలకు పెరిగింది. ప్రతి కాల్వ నుంచి నేరుగా పంట పొలాలకు నీరు చేరనప్పటికీ కేవలం చెరువులు నింపడంతో  భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయి. గతంలో 300అడుగుల లోతులో బోరు వేసినా రాని నీళ్లు ప్రస్తుతం కేవలం 100అడుగుల లోతులోనే వస్తున్నాయి.  సూర్యాపేట జిల్లాలోని 69, 70, 71డీబీఎం(డిస్ట్రిబ్యూటరీ బీయాండ్‌ మానేర్‌)ల ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు సాగు నీటిని అందిస్తున్నారు. మొత్తం మీద గత సంవత్సరం యాసంగితో పోల్చితే ఈ సంవత్సరం యాసంగిలో వరి సాగు మూడు రెట్లు పెరిగింది. 

 

ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే నెంబర్‌ 1

తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా అత్యధికంగా 6.43లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి ప్రథమ స్థానంలో నిలిచింది. 

Updated Date - 2020-06-02T09:29:40+05:30 IST