Abn logo
Jun 2 2020 @ 05:04AM

‘పల్లె ప్రగతి’తో గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే రేఖ

ఉట్నూర్‌, జూన్‌ 1: రాష్ట్రంలోని పల్లెలను అభివృద్ధి చేయడానికి పల్లెప్రగతి దోహద పడుతుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. సోమవారం మండలంలోని దంతన్‌పల్లి గ్రామంలో గల మాలగూడెంలో పల్లెప్రగతి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాన్ని సందర్శించి వీదులను పరిశీలించారు. పలు వీదులలో ప్రజలతో మాట్లాడి వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలందరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 


ఎప్పటికప్పుడు మురికి కాలువలను శుభ్రం చేయిస్తు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు సూచించారు. మురికి గుంటలను పూడ్చి వేసి మురికినీరు నిల్వ ఉండకుండ చూడాలన్నారు. అనంతరం ఇంకుడు గుంత నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, డివిజనల్‌ పంచాయతీ ఆఫీసర్‌ బిక్షపతిగౌడ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు  సయ్యద్‌ సాజిద్‌, ఎంపీడీవో తిరుమల, సింగిల్‌ విండో చైర్మన్‌ సామ ప్రభాకర్‌రెడ్డి, అహ్మద్‌ అజీమోద్దిన్‌, ముచ్చినేని భూమన్న,  సింగారే భరత్‌,  మాజీ మండల పార్టీ అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణీరాజేష్‌, సందీ్‌పరెడ్డి, ఉమేష్‌, మునీర్‌, సత్యం,  తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఇంద్రవెల్లి  మండాన్ని సందర్శించి ఇటీవల  బుర్సన్‌పటార్‌ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్లు దగ్ధమై సర్వం కోల్పోయిన శివాజీ, బాలాజీ, అంకుష్‌ కుటుంబాలను పరామర్శించి, అన్నివిధాల ఆదుకుంటామన్నారు.


ప్రభుత్వ సహాయం వెంటనే అందించాల ని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం ఇంద్రవెల్లి మండలంలోని ఎమాయికుంట, హర్కాపూర్‌, కైలాస్‌నగర్‌, తదితర ప్రాంతాలలో పర్యటించి పల్లెప్రగతి కార్యక్రమాల ద్వారా అబివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. రాంనగర్‌ ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వసంత్‌రావు రాథోడ్‌, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ మారుతిడోంగ్రే, ఎంపీడీవో రమాకాంత్‌, తహసీల్దార్‌ రాఘవేందర్‌రావు, తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement