దశలవారీగా గ్రామాల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-01-26T06:06:25+05:30 IST

దశాలవారీ గా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కేంద్రప్రభుత్వం సూచన మేరకు సంసద్‌ ఆదర్శ గ్రామయోజన కార్యక్రమంలో భాగంగా దివంగత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి స్వగ్రామం వడపర్తిని దత్తత తీసుకున్నారు.

దశలవారీగా గ్రామాల అభివృద్ధి
భువనగిరి మండలం వడపర్తి గ్రామసభలో మాట్లాడుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అందుకే వడపర్తిని దత్తత తీసుకుంటున్నా

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

భువనగిరి రూరల్‌, జనవరి 25: దశాలవారీ గా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కేంద్రప్రభుత్వం సూచన మేరకు సంసద్‌ ఆదర్శ గ్రామయోజన కార్యక్రమంలో భాగంగా దివంగత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి స్వగ్రామం వడపర్తిని దత్తత తీసుకున్నారు. కలెక్టర్‌ పమేలాసత్పథి, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో సర్పంచ్‌ ఎలిమినేటి కృ ష్ణారెడ్డి అధ్యక్షతన మంగళవారం గ్రామసభ నిర్వహించారు. సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలపై శాఖలవారీగా సమీక్షించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమీక్షిస్తుండగా.. తమకు మిషన్‌భగీరథ పథకం కింద గోదావరి జలాలు అందడంలేదని, తామంతా బోరునీళ్లు, ఫిల్టర్‌ నీళ్లు కొనుగోలు చేసి తాగుతున్నామని ఎంపీ, కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు వెచ్చించి మిషన్‌ భగీరథ పథకం కింద తాగునీరు అందిస్తున్నట్లు చెబుతోందని, గ్రామంలో ఈ పథకంకింద నల్లా కనెక్షన్లు ఇచ్చారా? అని అధికారులను ప్రశ్నించారు. అధికారులు స్పందిస్తూ గ్రామంలో కొత్త కనెక్షన్లు ఇవ్వలేదని, పాత నల్లాల ద్వారానే తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. కొత్త కనెక్షన్ల కు వాల్వ్‌లు ఏర్పాటు చేయలేదని, ఒక్కోదానికి రూ. 20వేల నుంచి రూ.30వేల ఖర్చు అవుతుందని వివరించారు. ఎంపీ స్పం దిస్తూ మిషన్‌ భగీరథ పథకం కింద పనులు పూర్తి కాకుండానే.., పూర్తి అయినట్లు చూపిస్తున్నారని, కోట్ల రూపాయలు ఖ ర్చుచేసి ప్రజలకు తాగునీరు ఇవ్వకుంటే ఏం ప్ర యోజనమన్నారు. నెలరోజుల్లోగా గ్రామంలో అందరి కీ కొత్త కనెక్షన్లు ఇవ్వాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామసభలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రతిజ్ఞచేశా రు. ఈ సందర్భంగా ఆరోగ్య ఉపకేంద్రానికి 150గజాల స్థలా న్ని ఉచితంగా ఇచ్చిన ఉపసర్పంచ్‌ బొబ్బిలి మణమ్మను ఎంపీ, కలెక్టర్‌ సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బురు బీరుమల్లయ్య, వైస్‌ ఎం పీపీ ఏనుగు సంజీవరెడ్డి, ఎంపీటీసీ ఉడుత అలివే లు, ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ డీఆర్‌డీవో నాగిరెడ్డి, మండల వైద్యాధికారి కిరణ్‌కుమార్‌, నాయకులు పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, బర్రె జహంగీర్‌, బీర్ల అయిలయ్య, పల్లి రవికుమార్‌, వెంకటేశ్‌, పల్లవి, సురేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T06:06:25+05:30 IST