గిరిజనుల ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2020-05-28T09:13:34+05:30 IST

గిరిజనుల ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చామకూరి శ్రీధర్‌ తెలిపారు. ఐటీడీఏ పీవోగా

గిరిజనుల ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

  • - ఐటీడీఏ పీవో చామకూరి శ్రీధర్‌
  • - భాద్యతల స్వీకరణ


సీతంపేట, మే 27 : గిరిజనుల ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చామకూరి శ్రీధర్‌  తెలిపారు. ఐటీడీఏ పీవోగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘గిరిజనులకు ఆదాయం సమకూరేలా అన్ని మార్గాలను అన్వేషిస్తాం. ఏజెన్సీలో గిరిజనులకు  తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడతాం. వ్యవసాయ అభివృద్ధితో పాటు విద్య, వైద్యం, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పన రంగాలపై దృష్టి సారిస్తాం. గతంలో తితలీ తుఫాన్‌ సమయంలో కంచిలి మండలంలో ప్రత్యేకాధికారిగా సుమారు 50 రోజులు విధులు నిర్వహించాను. ఈ అనుభవం నాకు ఎంతగానో కలసి వచ్చింది. ఉద్యోగులు, గిరిజనులను సమన్వయ పరుస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. గతంలో పని చేసిన పీవోలు చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగిస్తాం. కలెక్టర్‌ నివాస్‌ సూచన మేరకు ఐటీడీఏ అభివృద్ధికి మరింత కృషి చేస్తా. మారుమూల గ్రామాల్లో ప్రధాన రహదారుల పనులు పూర్తిచేస్తా. రోడ్లను అనుసంధానం చేసి.. గిరిజనులకు రవాణా సదుపాయం కల్పిస్తాం’ అన్నారు.


అభినందనలు

‘ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశా. గతంలో ఒరాకిల్‌ సంస్థలో ఇంజనీర్‌గా కొంతకాలం పనిచేశాను. అనంతరం ఐఏఎస్‌కు ఎంపికై మొట్టమొదటిసారిగా కావలి సబ్‌కలెక్టర్‌గా విధులు నిర్వర్తించాను. నా రెండోపోస్టు ఐటీడీఏ పీవోనేనని శ్రీధర్‌ స్పష్టం చేశారు. అనంతరం ఆయనకు ఐటీడీఏలోని వివిధ శాఖల  అధికారులు, గిరిజన సంఘ నాయకులు, రెవెన్యూ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. అభినందనలు తెలిపారు.  

Updated Date - 2020-05-28T09:13:34+05:30 IST