Abn logo
Mar 2 2021 @ 23:36PM

కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, చిత్రంలో మరో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి, ఎమ్మెల్యేలు

-  ఎమ్మెల్సీ ఎన్నికల సభల్లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి

నారాయణపేట టౌన్‌/ మక్తల్‌, మార్చి 2 : ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే తెలం గాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని ఎక్సైజ్‌ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మంగళవా రం మక్తల్‌, నారాయణపేట పట్టణాల్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమా వేశాలకు ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, వ్య వసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మక్తల్‌లో ద్వారకా ఫంక్షన్‌హాల్‌లో, పేట టీఆర్‌ ఎస్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమాలకు ఆయా నియోజకవ ర్గాల ఎమ్మెల్యే లు చిట్టెంరామ్మోహన్‌రెడ్డి, ఎస్‌.రాజేందర్‌రెడ్డిలు అధ్యక్షత వహించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే 1.32లక్షల ఉద్యోగాలుభర్తీ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మరో 50వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన బీజేపీ నాయకులు చేసేదేమీలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నా రు. ప్రతి కార్యకర్త అభ్యర్థిలా భావించి పట్టభద్రులకు సంక్షేమ పథకాలు వివ రించి ఓట్లు రాబట్టాలన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని అన్నా రు. దీని వల్ల రిజర్వేషన్లు సైతం కోల్పోయే ప్రమాదముందన్నారు. ఆరేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో జీడీపీ 17.4శాతానికి తగ్గిందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా రన్నారు. అభివృద్ధిని మరింత విస్తరించేందుకు పట్టభద్రులంతా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మక్తల్‌ కార్యక్రమంలో స్టేట్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ చైర్మ న్‌ దేవరి మల్లప్ప, పేట జడ్పీ చైర్మన్‌ వనజాఆంజనేయులుగౌడ్‌, డీసీసీబీ చైర్మ న్‌ నిజాంపాషా, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకురాలు, గద్వాల, వనపర్తి జిల్లాల శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ లలితాముదిరాజ్‌, ఎంపీపీ వనజ, మార్కెట్‌ చైర్మన్‌ రాజేష్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మాగనూరు మండ ల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు రామలింగం, గోవర్ధన్‌రెడ్డి, పేటలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సురేఖ, ఏఎంసీ చైర్మన్‌ భాస్కర కుమారి, వైస్‌ చైర్మన్‌ కన్న జగదీశ్‌, పుర చైర్‌పర్సన్‌ గందె అనసూయ, వైస్‌ చైర్మన్‌ హరి నారాయణ భట్టడ్‌, జడ్పీటీసీ అంజలి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రాజవర్దన్‌ రెడ్డి, విజయ్‌ సాగర్‌, సుదర్శన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement