టీడీపీ హయాంలోనే పిన్నాపురం అభివృద్ధి

ABN , First Publish Date - 2022-08-17T05:34:30+05:30 IST

టీడీపీ హయాంలోనే పిన్నాపురం అభివృద్ధి జరిగిందని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

టీడీపీ హయాంలోనే పిన్నాపురం అభివృద్ధి
పిన్నాపురం వస్తున్న గౌరు దంపతులు

మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత

పాణ్యం, ఆగస్టు 16: టీడీపీ హయాంలోనే పిన్నాపురం అభివృద్ధి జరిగిందని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం పిన్నాపురం గ్రామాన్ని టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ అఽధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మండల నాయకులతో కలిసి సందర్శించి రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా గ్రామ సమీపంలో గ్రీన్‌కో సంస్థ నిర్మిస్తున్న రిజర్వాయర్‌ కట్టను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పిన్నాపురం గ్రామాన్ని ఎవరు అభివృద్ధి చేశారో తెలపాలని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే గ్రీన్‌కో సంస్థకు పనులు మొదలయ్యాయని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రజల అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలు గాలికొదిలేశారన్నారు. జల విద్యుత్‌ నిర్మాణానికి గ్రామ సభ తీర్మానం జరగాలన్న నిబంధన మేరకు నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. గ్రామానికి రెండు కిలోమీ టర్ల దూరంలో కరకట్ట నిర్మాణం జరగాలని రైతులు కోరుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో ఇతరుల పేరున ఆన్‌లైన్‌ చేసి పరిహారం కాజేస్తున్నారని గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. అనంతరం జంబులాపరమేశ్వరి దేవాలయంలో గౌరు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కౌలూరు ఎంపీటీసీ నల్లల భాస్కరరెడ్డి, పాణ్యం ఎంపీటీపీ రంగరమేష్‌, మాజీ ఎంపీటీసీ వెంకటరమణ, తిరుపాలు, టీడీపీ మండల అధ్యక్షుడు గణపం జయరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి రమణమూర్తి, లీగల్‌ అడ్వయిజర్‌ రాంమోహన్‌నాయుడు, పుల్లారెడ్డి, శివశంకరరెడ్డి, దుబాయ్‌శీను, నెరవాడ ప్రతాపరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, అమరనాథరెడ్డి, మోహనరెడ్డి, సుధాకర్‌, సుబ్బయ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T05:34:30+05:30 IST