పట్టణాలకు సమాంతరంగా పల్లెల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-07-07T05:50:04+05:30 IST

పట్టణాలకు సమాంతరంగా పల్లెల అభివృద్ధి

పట్టణాలకు సమాంతరంగా పల్లెల అభివృద్ధి
నాగిళ్లలో రైతువేదికను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ వాణీదేవి

ఆమనగల్లు, జూలై 6: పట్టణాలకు సమాంతరంగా పల్లెలను తీర్చిదిద్ది ప్రజలకు మౌలిక వసతులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌,  ఎమ్మెల్సీ సురభి వాణిదేవిలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ముందుకు సాగుతుందని, రాష్ట్రాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తుందని వారు పేర్కొన్నారు. మాడ్గుల మండలం నాగిళ్ల, కొల్కులపల్లి, బ్రాహ్మణ పల్లి, ఇర్విన్‌, దొడ్లపహాడ్‌ గ్రామాలలో బుధవారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ వాణీ దేవిలు విస్తృతంగా పర్యటించారు. రైతువేదికలు, డంపింగ్‌యార్డులు, సీసీరోడ్లు ప్రారంభిం చారు. కొల్కులపల్లి ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో సర్పంచ్‌లు రమేశ్‌రెడ్డి, భట్టు అనురాధ, లక్ష్మయ్య, పుష్పలత, గజ్జె విజయల అధ్యక్షతన జరిగిన సమావేశాలలో జైపాల్‌యాదవ్‌, వాణీదేవిలు మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారం లోకి వచ్చాకే మారుమూల గ్రామాలు, గిరిజనతండాలు వేగంగా అభివృద్ధి సాధించా యన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, వైఎస్‌ ఎంపీపీ శంకర్‌ నాయక్‌, ఎంపీటీసీలు నారమ్మ, భట్టు కిషన్‌రెడ్డి, సౌమ్మ, తిరుపతమ్మ, జైపాల్‌రెడ్డి, జ్యోతి, ఆమనగల్లు మార్కె ట్‌ వైస్‌ చైర్మన్‌ తోట గిరియాదవ్‌, నాయకులు సుభాష్‌, లాలయ్యగౌడ్‌, ఎంపీడీవో పారుఖ్‌ హుస్సేన్‌, తహసీల్దార్‌ దేవుజా, సీఐ కృష్ణమోహన్‌, ఎస్‌ఐ రమేశ్‌, ఏవో గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:50:04+05:30 IST