‘నాడు-నేడు’తో అంగన్‌వాడీల అభివృద్ధి

ABN , First Publish Date - 2021-04-17T05:20:45+05:30 IST

నాడు-నేడు కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు, ఆధునికీకరణకు ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు ఎస్‌.కోట ఐసీడీఎస్‌ పీవో ఎం.ఉమ తెలిపారు.

‘నాడు-నేడు’తో అంగన్‌వాడీల అభివృద్ధి
ఎస్‌.కోటలో మాట్లాడుతున్న ఐసీడీఎస్‌ పీవో

శృంగవరపుకోట: నాడు-నేడు కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు, ఆధునికీకరణకు ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు ఎస్‌.కోట ఐసీడీఎస్‌ పీవో ఎం.ఉమ తెలిపారు. శుక్రవారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యా లయంలో అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ప్రాజెక్టు పరిధిలో 9పాత భవనాల ఆధునికీకరణ, 10 కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. సూపర్‌వైజర్లు పి. భాగ్యలక్ష్మి, పి.సుశీల ఉన్నారు. 

  శృంగవరపుకోట రూరల్‌:  అంగన్‌వాడీలను నాడు-నేడు పనుల ద్వారా ప్రభుత్వం మరింత బలోపేతం చేయనుందని ఎంపీడీవో సతీష్‌ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో నాడు నేడు పనులపై సమీక్షించారు. మండలంలో ఆరు అంగన్‌వాడీలకు నూతన భవన నిర్మాణాలు, మరో ఐదు అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఈ కమిటీ ద్వారా తీర్మానం చేశారు. కమిటీల ఆధ్వ ర్యంలో  ప్రభుత్వం అందించే 15శాతం రివాల్వింగ్‌ ఫండ్‌తో గృహ నిర్మాణశాఖ పనులు చేపడుతుందని ఆయన తెలిపారు. ఐసీడీఎస్‌ అధికారులు, సిబ్బంది,  అభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు.

  కురుపాం: ‘మన అంగన్‌వాడీ నాడు-నేడు’  కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని ఐసీడీఎస్‌ పీవో విజయగౌరి కోరారు. కురుపాంలో  అంగన్‌ వాడీ అభివృద్ధి కమిటీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ నాడు-నేడు కార్యక్రమంలో అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఏఈ శాంతి నాయుడు, సూపర్‌ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

  గరుగుబిల్లి: అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని ఎంపీడీవో జి.చంద్రరావు సూచించారు. మండల అభివృద్ధి కార్యాలయంలో అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్‌వాడీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభు త్వం నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తుందన్నారు. భవనాలకు కావలసిన సామగ్రిని కొనుగోలు చేయడం, ఖర్చుల విషయంలో అభివృద్ధి కమిటీ సభ్యులదే ప్రధాన పాత్ర అని తెలిపారు. పార్వతీపురం ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్లు వై.రామలక్ష్మి, ఆర్‌.లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు మెరుగైన సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలు చేపడుతున్నా మన్నారు. హౌసింగ్‌ ఇంజినీర్‌ చిరంజీవి, సీనియర్‌ సహాయకులు రమేష్‌ బాబు, సచివాలయ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

  సీతానగరం: సీతానగరం మండలంలో పెదబోగిల బుడ్డిపేట, లచ్చయ్యపేట , సుమిత్రాపురం , నిడిగల్లు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో నూతన భవనాలు మంజూరైనట్లు ఐసీడీఎస్‌ పీవో ఉమాభారతి తెలిపారు. స్థానిక కల్యాణ మండపంలో అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ సభ్యులతో మాట్లాడారు.  నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీలకు నూతన భవనాలు మంజూరయ్యా యన్నారు. ఒక్కో భవనానికి రూ. 5,50,000  కేటా యించినట్లు చెప్పారు. వీటి నిర్మాణాలను అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ సభ్యులు చేపడతారని తెలిపారు.  ఈ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉంటార న్నారు.  హౌసింగ్‌ ఏఈ సోమేశ్వరరావు, సూపర్‌వైజర్లు  పాల్గొన్నారు. 

  చీపురుపల్లి: నాడు-నేడు  కింద చేపట్టనున్న అంగన్‌వాడీ భవనాల విషయంలో నాణ్యత లోపం రాకుండా చూడాలని ఎంపీడీవో  కె.రామకృష్ణరాజు సూచించారు.  మండల పరిషత్‌ కార్యాలయంలో  అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ లతో మాట్లాడారు.  మండలంలో  11 సెంటర్లకు పక్కా భవనాలు మంజూర య్యాయన్నారు. వీటి నిర్మాణం విషయంలో అభివృద్ధి కమిటీలే పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. మెటీరియల్‌ కొనుగోలు తదితర విషయాల్లో కమిటీలు అప్రమత్తంగా వ్యవహరించి, భవన నిర్మాణాల నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. హౌసింగ్‌ ఏఈ బి.సూర్యానారాయణ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

  గరివిడి: అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని గరివిడి ఎంపీడీవో  జి.భాస్కరరావు తెలిపారు. చీపురుపల్లి ఐసీడీఎస్‌ ఏసీడీ పీవో  ఏస్తేరురాణి ఆధ్వర్యంలో  అంగన్‌వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వ హించారు. మండలంలో మరమ్మతులకు గురైన అంగన్‌డీ కేంద్రాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.  నూతనంగా భవనాలు కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. అంగన్‌వాడీల అభివృద్ధికి ఏడుగురి సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు  మంగమ్మ, జయలక్ష్మి, హౌసింగ్‌ ఏవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

  గుర్ల: అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ సభ్యులు బాధ్యతగా పనిచేయాలని నెల్లిమర్ల ఐసీడీఎస్‌ పీవో అనంతలక్ష్మి తెలిపారు.  గుర్ల మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అభివృద్ధి కమిటీలో అంగన్‌వాడీ  కార్యకర్త, సూపర్‌వైజర్‌, రెండు నుంచి నాలుగేళ్ల లోపు పిల్లలు, తల్లులు, మహిళా పోలీసు, ఇంజినీరింగ్‌ అసి స్టెంట్‌ ఉంటారని తెలిపారు. మండలంలో 9 అంగన్‌వాడీలకు మంజూరైన భవన నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. నాడు-నేడు కార్య క్రమం లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశిం చారు. సూపర్‌వైజర్‌, హౌసింగ్‌ ఏఈ తదితరులు పాల్గొన్నారు. 


  

Updated Date - 2021-04-17T05:20:45+05:30 IST