కడప: వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప స్టీల్‌ప్లాంట్‌కు పునాదిరాయి వేసి రెండేళ్లైనా ఎలాంటి పురోగతి లేదని తప్పుబట్టారు. అన్నమయ్య ప్రాజెక్టు గేటు ఏడాదిగా రిపేర్ చేయించలేదు... దీని వెనుక కూడా తామే ఉన్నామా?: అని ప్రశ్నించారు. ఢిల్లీకి వచ్చి ప్రాజెక్టులు, పథకాలు అడగడం లేదా అని ప్రశ్నించారు. అప్పుల కోసం ఢిల్లీ వచ్చి ఏపీ పరువు తీస్తున్నారని సీఎం రమేష్ దుయ్యబట్టారు.