Abn logo
Sep 25 2021 @ 23:30PM

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

రాయికల్‌, సెప్టెంబరు 25: పట్టణ, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని శ్రీరాంనగర్‌ గ్రామంలో డిఎంఎఫ్‌టీ నిధులు రూ.4.60లక్షలతో నిర్మించిన కమ్మూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాంనగర్‌ గ్రామం చాలా చిన్న గ్రా మమని అభివృద్ధిలో, పారిశుధ్యంలో అన్ని గ్రామాలకు ఆదర్శమని అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామాల ముఖచిత్రం మారిపో యిం దని పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల రూపురేఖలు మారాయని అన్నా రు. గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరు చేయడం ద్వారా కంపోస్ట్‌ ఎరువు త యారవుతుందని గ్రామాల్లో వైకుంఠదామాలు, కంపోస్ట్‌ షెడ్డు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.. గ్రామాల్లో నేడు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆహ్లాదాన్ని పంచుతున్నాయని అన్నారు. ఈకార్య క్రమంలో ఎంపీపీ సంధ్యారాణి, సర్పంచ్‌ రాజమౌళి, ఎంపీటీసీ సాగరిక, సిం గిల్‌విండో చైర్మన్‌ రాజలింగం, మండల కోఆప్షన్‌ ముఖీద్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నాగరాజు, ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, ఏపీడీ సుధీర్‌, ఏఈ వెంకటప్రసాద్‌ పాల్గొన్నారు.