అభివృద్ధి, సంక్షే మం రెండు కళ్లు

ABN , First Publish Date - 2022-08-14T06:28:35+05:30 IST

ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.

అభివృద్ధి, సంక్షే మం రెండు కళ్లు
బేతపూడిలో పథకాల పుస్తకాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్న డిప్యూటీ సీఎం బూడిముత్యాలనాయుడు


డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు 

దేవరాపల్లి, ఆగస్టు 13: ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని రైవాడ శివారు కొల్లివానిపాలెం, బేతపూడి కాలనీలో గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రతి ఇంటికి వెళ్లి పథకాలు అందుతున్నదీ లేనిది అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చేందుకు  అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, మాజీఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, సర్పంచ్‌ చల్లా.లక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు ఉర్రూకల గంగాభవాని, బూరే బాబూరావు, చల్లా తాతయ్యలు, వెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వి.సింహాచలంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T06:28:35+05:30 IST