పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు

ABN , First Publish Date - 2020-12-06T05:45:11+05:30 IST

ఏజెన్సీలో పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు ఐటీడీఏ ప్రవీణ్‌ఆదిత్య అన్నారు. శనివారం ఆయన స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు.

పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు

  • ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ఆదిత్య

రంపచోడవరం, డిసెంబరు 5: ఏజెన్సీలో పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు ఐటీడీఏ ప్రవీణ్‌ఆదిత్య అన్నారు. శనివారం ఆయన స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఏజెన్సీలోని ఏడు మండలాల్లో వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా 2,514 యూనిట్లు మంజూరుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గిరిజన రైతులకు పాడిపై మక్కువ చూపే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని సీఎం జగన ఈనెల 10న ప్రారంభించనున్నట్టు చెప్పారు. పీవీటీజీలకు వైఎస్‌ఆర్‌ పథ కం ద్వారా ప్రత్యేక రాయితీ ద్వారా సరఫరా చేస్తామన్నారు. అలాగే ఏడు మండలాల విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్సలో ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పఽథకం అర్హుల ఖాతాల్లో సొ మ్ములు జమచేసే బాధ్యత ఎంఈవోలు, ఏటీడబ్ల్యువోలపై ఉందని ఐటీడీఏ పీవో అన్నారు. పథకం అర్హులందరికీ చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏజెన్సీలో 1,098 మంది విద్యార్థులకు రేషన, ఆధార్‌కార్డుల్లో తేడాలు గుర్తించామని, వాటిని సరిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా సమావేశాల్లో  పశు సంవర్ధకశాఖ డీడీ రమేష్‌నాయక్‌, ఏడీలు సూర్యనారాయణ, శ్రీనివాస్‌, ఏపీవో పీవీఎస్‌ నాయుడు, ఎస్‌వో వెంకటేశ్వరరావు, వైద్యాధికారి గోపిక, ఏంఈవోలు మల్లేశ్వరరావు, తాతబ్బాయి, ఏటీడబ్ల్యువోలు సుజాత, శంభుడు, ఎంపీడీవో లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:45:11+05:30 IST