Abn logo
Oct 25 2021 @ 22:10PM

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బంది

గూడూరు, అక్టోబరు 25: విద్యార్థులు చదువులలో రాణించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి అన్నారు.  పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విద్యార్ధులకు పోలీసుల విధులు, వివిధ రకాల ఆయుధాలు, బాంబుస్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌ పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణకు పాటుపడేది పోలీసు వ్యవస్థేనన్నారు. విద్యార్ధులకు పోలీసు విధులపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించా మన్నారు. కార్యక్రమంలో సీఐ నాగేశ్వరమ్మ, ఎస్‌ఐలు పవన్‌కుమార్‌, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.