Feb 26 2021 @ 23:09PM

11న విజయ్‌ ప్రేమకథ...

విజయ్‌ శంకర్‌, మౌర్యాని జంటగా నటించిన ‘దేవరకొండలో విజయ్‌ ప్రేమకథ’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 11న విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. నిర్మాత పడ్డాన మన్మథరావు మాట్లాడుతూ ‘‘ప్రేమికులకు, తల్లిదండ్రులకు, సమాజానికి నచ్చే కథ ఇది’’ అని తెలిపారు. ‘‘ఒక ఊర్లో జరిగే కథ ఇది. దీనిని ఆసక్తికరంగా మలిచాం’’ అని దర్శకుడు వెంకటరమణ.ఎస్‌ అన్నారు.