కర్నూలు: జిల్లాలోని దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బన్నీ ఉత్సవంలో మునుపటి లాగే తలలు పగిలాయి. మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. జైత్రయాత్రలో రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు. దీంతో దేవరగట్టులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో రక్తం చిందినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. దేవరగట్టులో అధికారులు వైద్య సిబ్బందిని, తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చెయ్యకపోవడంతో క్షతగాత్రులను ఆలూరు, ఆదోని ఆస్పత్రులకు తరలించారు. దేవరగట్టులో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా దేవరగట్టు బన్నీ ఉత్సవాలను అధికారులు రద్దు చేశారు. దేవరగట్టులో భక్తుల రాక ద్రుష్ట్యా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవరగట్టుకు దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చారు.