Abn logo
Mar 6 2021 @ 19:53PM

అఫీషియల్‌: ‘శాకుంతలం’లో దుష్యంతుడిగా ఎవరంటే..?

దర్శకుడు గుణశేఖర్‌ పేరు వినగానే ఎవరికైనా భారీ తనమే గుర్తుకు వస్తుంది. ఆయన తన సినిమాల్లో భారీ సెట్స్‌ వేసి షూటింగ్స్‌ చేస్తుంటారు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌పై గుణశేఖర్‌ అండ్‌ టీమ్‌ ఎక్కువగా కష్టపడుతుంటారు. ప్రస్తుతం గుణశేఖర్ తన దర్శక నిర్మాణంలో ప్యాన్‌ ఇండియా మూవీగా 'శాకుంతలం' మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో స్టార్‌ హీరోయిన్‌ సమంతను శకుంతల పాత్రకు గుణశేఖర్‌ సెలక్ట్ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఈ సినిమాలో దుష్యంతుడుగా ఎవరు నటిస్తారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. టాలీవుడ్‌కి చెందిన కొందరి పేర్లు కూడా వినిపించాయి. వాటన్నిటికి స్వస్తి చెబుతూ.. తాజాగా గుణశేఖర్‌.. ఈ చిత్రంలో నటించే దుష్యంతుడిని కూడా ప్రకటించేశారు. 

మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ ఈ చిత్రంలో దుష్యంతుడిగా కనిపించబోతున్నారు. ఈ విషయం చెబుతూ.. తాజాగా శకుంతల పాత్రధారి, స్టార్‌ హీరోయిన్‌ సమంత ఓ వీడియోను అధికారికంగా విడుదల చేశారు. ఇక మేకింగ్‌ పరంగా తనదైన పంథాలో గుణశేఖర్ శాకుంతలం కోసం భారీ సెట్స్‌ను వేస్తున్నారు. ఇతిహాసంలో దుష్యంత మహారాజు, శకుంతల ప్రేమకథను సినిమా రూపంలో చూపించడమంటే సులభమైన విషయం కాదు. ప్రస్తుతం గుణశేఖర్‌ అండ్‌ టీమ్‌ అదే పనిలో బిజి బిజీగా ఉన్నారు. 


Advertisement
Advertisement
Advertisement