జూరాల అధికారుల నిర్బంధం

ABN , First Publish Date - 2021-10-28T05:11:26+05:30 IST

వనపర్తి జిల్లా చిన్నంబావి మం డలంలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని రైతులు జూరాల అధికారులను నిర్బంధించారు.

జూరాల అధికారుల నిర్బంధం
నిర్బంధంలో ఉన్న జూరాల అధికారులు

- చివరి ఆయకట్టుకు నీరందించాలని రైతుల డిమాండ్‌

వీపనగండ్ల, అక్టోబరు 27: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని రైతులు జూరాల అధికారులను నిర్బంధించారు. జూరాల, భీమా కాలు వల ద్వారా గోప్లాపూర్‌, సింగవరం, సంపట్రావ్‌పల్లి గ్రామాల్లోని చివరి ఆయకట్టు పంటలకు సాగనీరు అందక ఎం డిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదని మండిపడ్డారు. జూరాల సబ్‌ డివిజన్‌-2 డిప్యూటీ ఈఈ శ్రీనివాసులు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు జగదీష్‌, శ్రీనివాస్‌ కాల్వలను పరిశీలించేందుకు బుధవారం కాలువల వెంట వెళ్లారు.  వారిని లక్ష్మిపల్లి స్టేజీ వద్ద  గేట్లు మార్చేందుకు ఏర్పాటు చేసిన షెడ్డులో బంధించారు. నీళ్లు వదిలి వేరుశనగ, మినుము, వరి పంటలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. నీళ్లు అందకపోతే వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నంబావి పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి అధికారులను విడిపించారు. రామన్‌పాడు నుంచి నీళ్లు తక్కువగా వదులుతున్నారని, రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. గోపాల్‌దిన్నె రిజర్వాయర్‌ ఆవుట్‌ ప్లో గేట్లు మూసివేయించారు. రిజర్వాయర్‌ నిండిన వెంటనే నీటిని విడుదల చేస్తామని రైతులకు తెలిపారు.



Updated Date - 2021-10-28T05:11:26+05:30 IST