నిర్బంధం

ABN , First Publish Date - 2022-06-28T05:40:27+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం పలువురు కార్మిక, ప్రజాసంఘాల, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు విపక్ష నేతలను పోలీసు లు ముందస్తు అరెస్టులు చేశారు.

నిర్బంధం
హిరమండలంలో జడ్పీటీసీ సభ్యుడు బుచ్చిబాబును అడ్డుకున్న దృశ్యం


  ప్రజా సంఘాల నాయకుల ముందస్తు అరెస్టు

  ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్న పోలీసులు

 సీఎం పర్యటనే కారణం 

టెక్కలి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం  పలువురు కార్మిక, ప్రజాసంఘాల, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు విపక్ష నేతలను పోలీసు లు ముందస్తు అరెస్టులు చేశారు. వారి ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకు న్నారు. ఎక్కడికక్కడే తమను నిర్బంధించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరని హెచ్చరించారు. సమస్యలపై సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు యడ్ల గోపి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షన్ముఖరావు ఆవేదన వ్యక్తం చేశారు. 

నరసన్నపేట: శ్రీకాకు ళంలో జరిగిన సీఎం బహిరంగ సమావేశానికి ఉపాధ్యాయ సంఘనాయకులు ఎవరూ వెళ్లకుండా పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. సోమవారం ఉదయం నుండి ఉపాధ్యాయ సంఘనాయకులను అదుపులోకి తీసుకున్నారు. జీవో నెంబరు 117కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు సీఎం సభలో ప్లకార్డులు చూపిస్తారనే ఉద్దేశ్యంతో అరె స్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

కొత్తూరు: నిర్వాసితుల సంఘ రాష్ట్ర కార్యదర్శి గంగారాపు, సింహాచలం, ఉప కార్యదర్శి గంగారాపు ఈశ్వరమ్మలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మెట్టూరులో వారి నివాసం వద్దే అ డ్డుకున్నారు. ఈ అరెస్టులను ఏపీ వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా అధ్యక్షుడు శిర్ల ప్రసాద్‌ మండిపడ్డారు.

 హిర మండలం: విపక్షనేతలను గృహ నిర్బంధాలు, అరెస్టు లు చేయడం దుర్మార్గమని హిరమండలం జడ్పీటీసీ సభ్యుడు పి.బుచ్చిబాబు అన్నారు. సీఎం పర్యటన నేప థ్యంలో సోమవారం జడ్పీటీసీని పోలీసులు గృహనిర్బంఽ దం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముం దస్తు అరెస్టులు చేస్తు ఉద్యమాలు అడ్డుకోలేరన్నారు. వంశధార నిర్వాసితులకు 2013 చట్టం ప్రచాకం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎచ్చెర్ల: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ శాఖ అధ్యక్షుడు నాసరయ్యను ఎచ్చెర్ల పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. స్వంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.  

ఆమదాలవలస: ముఖ్యమంత్రి జిల్లాకు రాక సందర్భంగా పలువురు సంఘ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.ఎమ్మార్పీఎస్‌ నాయకుడు లోపింటి నారాయణరావు, వీఆర్‌ఏల  సంఘ మండలాధ్యక్షుడు కె.రమణమూర్తి, సంఘ నాయకుడు వన్నెల నారాయణరావును అదుపులోకి తీసుకొని మధ్యాహ్నం పోలీసులు విడిచిపెట్టారు. 

అరసవల్లి: సీపీఎం జిల్లా కార్యద ర్శి డి.గోవిందరావు, నగర కన్వీనర్‌ టి.తిరుపతి రావును పోలీసులు అరెస్టు చేసి 2వ పట్టణ స్టేషన్‌కు తరలించారు.  అక్రమ అరెస్టులను వారు ఖండించారు.


  


Updated Date - 2022-06-28T05:40:27+05:30 IST