Abn logo
Apr 17 2021 @ 02:30AM

ఒడిశా జైలు నుంచి పరారైన ఖైదీ పట్టివేత

ఆ రాష్ట్ర పోలీసులకు అప్పగించిన తెలంగాణ పోలీసులు


న్యాల్‌కల్‌/భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 16: ఒడిశాలో రెండు హత్యలు చేసి జైలుశిక్షను అనుభవిస్తూ తప్పించుకున్న ఖైదీ హైదర్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలో పట్టుకున్నారు. ఒడిశాలో జైలుశిక్షను అనుభవిస్తున్న షేక్‌హైదర్‌ (57) అనారోగ్యానికి గురికావడంతో అక్కడి జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 10న అతడు ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. దీంతో ఒడిశా పోలీసులు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సమన్వయంతో అతడి ఫోన్‌ను ట్యాప్‌ చేశారు. దీని ఆధారంగా గురువారం రాత్రి మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలం కల్బేమల్‌-హత్నూర్‌-న్యాల్‌కల్‌ మీదుగా వెళ్తూ ముంగి చౌరస్తా సమీపంలో హైదర్‌ ఉన్నాడని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement