రైతులు సాగు చేసిన పంట వివరాలు తప్పక నమోదు చేయాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-28T06:12:10+05:30 IST

రైతులు సాగు చేసిన పంటల వివరాలు తప్ప క ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన వ్యవసాయా ధికారులను ఆదేశించారు.

రైతులు సాగు చేసిన పంట వివరాలు తప్పక నమోదు చేయాలి : కలెక్టర్‌
సచివాలయ సిబ్బందితో వివరాలు ఆరా తీస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

కూడేరు, అక్టోబరు 27: రైతులు సాగు చేసిన పంటల వివరాలు తప్ప క ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన వ్యవసాయా ధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె మండలంలోని గొట్కూరు గ్రా మ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు. సచివాలయ సిబ్బంది శాఖ ల వారీగా పనితీరుపై ఆరా తీశారు.  రైతులు ఎన్ని రకాల పంటలు సాగు చేశారు, క్రాప్‌ బుకింగ్‌పై అగ్రికల్చర్‌ అధికారులను ప్రశ్నించారు. సాగుచేసి న రైతులందరి పంటలు నమోదు చేయాలని తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకంపై అవగాహన కల్పించాలన్నారు. పాల ఉత్పత్తిపై వెటర్నరీ సి బ్బందిని వివరాలు అడిగారు. గృహనిర్మాణ శాఖలో వనటైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం, కరోనా వ్యాక్సినేషన, తాగునీరు, విద్యుత, రెవెన్యూ సమస్యలపై సం బంధిత సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు. నూతనంగా నిర్మిస్తున్న గ్రా మ సచివాలయాలు, రైతు భరోసా, విలేజ్‌ క్లినిక్‌ కేంద్రాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 


ఇప్పేరు చెరువుకు నీరు ఇవ్వండి 

హంద్రీనీవా కాలువ నుంచి ఇప్పేరు చెరువుకు నీరు విడుదల చేయాలని ఎంపీపీ నారాయణరెడ్డి, వైస్‌ ఎంపీపీ దేవా, గ్రామ సర్పంచ ఓబులేసు, ఎం పీటీసీ రమే్‌ష, స్థానిక రైతులు కలెక్టర్‌కు ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా గొట్కూరు గ్రామ రోడ్డు అధ్వానంగా ఉందని, మరమ్మ తులు చేపట్టాలని గ్రామస్థులు కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన, మండల ప్రత్యేకాధికారి డాక్టర్‌ శ్రీదేవి, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీఓ లక్ష్మినారాయణ, ట్రాన్సకో ఏఈ రాజేష్‌, హౌసింగ్‌ ఏఈ జయచంద్ర, అగ్రికల్చర్‌ ఏఈ విజయ్‌కుమార్‌, ఇనచార్జ్‌ ఈఓఆర్డీ మురళీకృష్ణ, ఉపాధిహామీ పథకం ఏసీ రవికుమార్‌, సూపర్‌వైజర్‌ ఝాన్సీరాణి పాల్గొన్నారు.


Updated Date - 2021-10-28T06:12:10+05:30 IST