వసతి గృహాల వివరాలు అందజేయాలి

ABN , First Publish Date - 2022-05-22T05:40:48+05:30 IST

కళాశాలల వసతి గృహా ల నిర్వహణ వివరాలు జూన్‌ 16లోగా అందజేయాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. విద్య, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల వసతి గృహాలు, సిబ్బంది, మౌలిక సదుపాయలతో కూడిన సమగ్ర వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అందజేయాలన్నారు.

వసతి గృహాల వివరాలు అందజేయాలి

అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి 

భువనగిరి రూరల్‌, మే 21: కళాశాలల వసతి గృహా ల నిర్వహణ వివరాలు జూన్‌ 16లోగా అందజేయాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. విద్య, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల వసతి గృహాలు, సిబ్బంది, మౌలిక సదుపాయలతో కూడిన సమగ్ర వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అందజేయాలన్నారు. సమావేశంలో డీఈవో కె.నర్సింహ, జిల్లా ఇం టర్మీడియట్‌ అధికారి సి.రమణి, సంక్షేమశాఖల జిల్లా అధికారులు శ్యాంసుంద ర్‌, యాదయ్య, ధనుంజయ్య, సెక్టోరియల్‌ అధికారి ఎన్‌.అండాలు, పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:40:48+05:30 IST