జిల్లాలో కరోనా కేసుల వివరాలు

ABN , First Publish Date - 2020-08-12T08:48:20+05:30 IST

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం నమోదైన కరోనా కేసుల వివరాలను సంబంధిత వైద్యులు వెల్లడించారు. పాజిటివ్‌ కేసుల వివరాలిలా ఉన్నాయి.

జిల్లాలో కరోనా కేసుల వివరాలు

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో  మంగళవారం నమోదైన కరోనా కేసుల వివరాలను సంబంధిత వైద్యులు వెల్లడించారు. పాజిటివ్‌ కేసుల వివరాలిలా ఉన్నాయి. 


 ధర్మవరం పట్టణంలో మంగళవారం 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యుడు అబ్దుల్‌కలాం తెలిపారు.


 చెన్నేకొత్తపల్లి మండలంలో ఒకరికి  కరోనా సోకినట్లు వైద్యసిబ్బంది తెలిపారు.


 కొత్తచెరువు మండలంలో 10మందికి కరోనా సోకినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.


 పుట్టపర్తి పట్టణంతో పాటు మండలంలోని కోవెలగుట్టపల్లిలో కలిపి 5 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు  వైద్యులు అజయ్‌కుమార్‌రెడ్డి, నాగరాజ్‌నాయ తెలిపారు.


 బత్తలపల్లి మండలంలో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు తహసీల్దార్‌ కుఫ్రా తెలిపారు.


 గోరంట్ల మండలంలో  11మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి తెలిపారు. 


 ఓబుళదేవరచెరువు మండలకేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో 15 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి రాజశేఖర్‌ తెలిపారు.


 తాడిపత్రి  పట్టణంలో మంగళవారం 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. 

 

 గార్లదిన్నెలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు.  


 గుంతకల్లులో 31 కరోనా కేసులు నమోదైనట్లు  తహసీల్దారు హరికుమార్‌ తెలిపారు. 


 రాయదుర్గం పట్టణం, రూరల్‌ ప్రాంతాల్లో 4 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు.  


 డీ హీరేహాళ్‌ మండల కేంద్రంలో ఆర్‌ఎంపీ వైద్యుని కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకినట్లు ఎంపీహెచ్‌ఈవో రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు.


  కూడేరు మండలంలో  28 మందికి కరోనా సోకినట్లు డాక్టర్‌ సరిత తెలిపారు. 


కరోనాతో ముగ్గురి మృతి

బత్తలపల్లి: మండలకేంద్రంలోని ఆర్డీటీ ఆస్పత్రిలో కరోనాతో  చికిత్స పొందుతూ మంగళవారం ముగ్గురు మృతి చెందినట్టు తహసీల్దార్‌ కుఫ్రా తెలిపారు. ఇందులో యల్లనూరు, ధర్మవరం, అనంతపురానికి చెందిన 63 ఏళ్ల వయసు పైబడిన వారు ఉన్నట్లు చెప్పారు.  

Updated Date - 2020-08-12T08:48:20+05:30 IST