నవగ్రహ విగ్రహాల ధ్వంసం

ABN , First Publish Date - 2022-08-16T05:49:53+05:30 IST

నవగ్రహ విగ్రహాల ధ్వంసం

నవగ్రహ విగ్రహాల ధ్వంసం
విగ్రహాలను ధ్వంసం చేసిన కార్లకు నిప్పంటించిన దుండగులు

బంట్వారం(కోట్‌పల్లి), ఆగస్టు 15: దుండగులు నవగ్రహ విగ్రహాల ధ్వంసం, రెండు కార్లకు నిప్పంటించినసంఘటన కోట్‌పల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మార్కండేయ అలయంలో నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న రెండు కార్లకు నిప్పంటించారు. ధ్వంసమైన విగ్రహాలను మురుగు కాల్వలో పడేశారు. శివాలయంలోని వెండి పామును ఎత్తుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం పీర్ల వద్ద ఉంచిన కొన్ని వస్తువులూ ఎత్తుకెళ్లారని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామంలో అలజడి రేగింది. బీజేపీ, హిందూ జనశక్తి, వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేశారు. నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని ధర్నాకు దిగారు. వారు మాట్లాడుతూ.. హిందూ ఆలయాలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, వాటికి రక్షణ కల్పించడం లేదన్నారు. పోలీసులు కేసులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వికారాబాద్‌ డీఏస్పీ బీవీ సత్యనారాయణ నాయకులతో మాట్లాడి త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో సదానంద్‌రెడ్డి, పాండుగౌడ్‌, శ్రీనివాస్‌, చరణ్‌రెడ్డి, రాఘవేందర్‌, మహేష్‌, కృష్ణ, సందీప్‌, జగదీష్‌, వెంకట్‌చారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-16T05:49:53+05:30 IST