జిల్లాలో పలుచోట్ల గంజాయి మొక్కల ధ్వంసం

ABN , First Publish Date - 2021-10-28T05:23:16+05:30 IST

గంజాయి రవాణా చేస్తు న్న నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులను బుధవారం పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశా రు.

జిల్లాలో పలుచోట్ల గంజాయి మొక్కల ధ్వంసం
ఒంటర్‌పల్లిలో పెంచిన గంజాయి మొక్కలు

పెద్దపల్లి టౌన్‌, అక్టోబరు 27: గంజాయి రవాణా చేస్తు న్న నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులను బుధవారం పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశా రు. వారి నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ రవీందర్‌ వెల్లడించారు. స్థానిక ఏసీపీ కార్యాలయంలో డీసీపీ రవీందర్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఇతర జిల్లాల నుం చి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బండారికుంటకు గంజాయి తరిలిస్తున్నారన్న సమాచారంతో సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్సైలు రాజేష్‌, రాజవర్ధన్‌లతో పాటు సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తు లు అనుమానాస్పదంగా కన్పించారు. వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో అదుపులోకి తీసుకుని వారి వివరాలు రాబట్టారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌కు చెందిన కాట్రోజు మంగ్యానాయక్‌, నిజామాబాద్‌ జిల్లా దేవితండాకు చెందిన బదావత్‌ బాబన్‌కుమార్‌లు తమ మొక్కజొన్న చేనులో గంజాయిని సా గు చేస్తున్నట్లు వెల్లడించారని డీసీపీ తెలిపారు. స్థానిక బండారికుంటకు చెందిన షేక్‌ ఆసీఫ్‌, ఎస్‌కే సాజీద్‌లకు గంజాయి విక్రయించినట్లు కాట్రో జు మంగ్యానాయక్‌, బాదవత్‌ బాబన్‌కుమార్‌ ఒప్పుకున్నారని డీసీపీ తెలిపారు. దీంతో ఆసీఫ్‌, సాజిద్‌ల ఇళ్లలో సోదాలు చేసి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు కాట్రోజు మంగ్యానాయక్‌, బాదావత్‌ బాబన్‌ కుమార్‌, షేక్‌ ఆసీఫ్‌, ఎస్‌కే సాజిద్‌ల పై కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.
మాచారెడ్డిలో నాటాసారా పట్టివేత
మాచారెడ్డి: మండలంలోని పలు తండాలు, గ్రామాల్లో గంజాయి, నాటుసారా కోసం పోలీసులు గాలించారు. ఈ విషయంపై ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిని అడుగా మండలంలోని మరితండా, బొడగుట్టతండా, వెనుకతండా, నడిమితండా, అంకిరెడ్డిపల్లి తండాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. నడిమి తండాకు చెందిన భుక్యా మాన్‌సింగ్‌ వద్ద ఐదు లీటర్ల నాటు సారా దొరడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ అభిలాష్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.
కాటివాడి తండాలో గంజాయి మొక్కల లభ్యం
గాంధారి : మండలంలోని కాటివాడి తండాలో బుధవారం పోలీసులు దాడులు నిర్వహించే సుమారు 20 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఎస్‌ఐ శంకర్‌ పక్కా సమాచారం మేరకు కాటి వాడి తండాలో దాడులు నిర్వహించి మొక్కలను ధ్వంసం చేశామ న్నారు. కాటివాడి తండాలో ప్రభుత్వ భూమిలో గంజాయి మొక్క లను అంతరపంటగా సాగు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి సాగు చేస్తున్న రైతుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఒంటర్‌పల్లిలో..
లింగంపేట: మండలంలోని ఒంటర్‌పల్లి తండాకు చెందిన బానోత్‌ కిషన్‌ నాయక్‌ ఇంటి ఆవరణలో 70 గంజాయి మొక్కలను పట్టుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. కిషన్‌ గంజాయి మొక్కలు పెంచుతున్నాడని పక్కా సమాచారం మేరకు పోలీసులు బుధవారం దాడి చేయగా అక్కడ 70 వరకు గంజాయి మొక్కలు అతని ఇంట్లో ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కిషన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-10-28T05:23:16+05:30 IST