దసరా వేడుక

ABN , First Publish Date - 2022-09-27T05:10:35+05:30 IST

పట్టణం, గ్రామాల్లో దసరా వేడుక నెలకొంది.

దసరా వేడుక
భీమవరం మహిషాసుర మర్దని

అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ, పూజలు


భీమవరం టౌన్‌, సెప్టెంబరు 26 : పట్టణం, గ్రామాల్లో దసరా వేడుక నెలకొంది. పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీరాంపురం శ్రీచక్రసహిత కనకదుర్గ అమ్మవారు స్వర్ణకవచలాం కృతమై భక్తులకు దర్శనం ఇచ్చారు. పంచామారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయంలో పార్వతీదేవిని మహాలక్ష్మిదేవిగా అలంకరించారు. భీమే శ్వరస్వామి ఆలయంలో మహిషాసుర మర్ధిని అమ్మవారు భక్తులు స్వర్ణకవ చాలంకృత అమ్మవారుగా దర్శనం ఇచ్చారు. పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో పద్మావతి అమ్మవారికి కుంకుమ పూజలు చేసి అలంకారం చేశారు. త్యాగరాజభవనంలో వాసవీ కన్యకా పరమేశ్వరిని బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు. కామాక్షి అమ్మవారిని హంస వాహనంపై ఊరే గించారు. మార్వాడీ సమాజ్‌ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిం చారు. శాశన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేయించుకున్నారు.


పాలకొల్లు అర్బన్‌: పట్టణంలో పలు ప్రాంతాలు, ఆలయాల్లో శరన్న వరాత్రుల వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, రాత్రి అమ్మవారిని లలితా దేవి గా అలంకరించారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. వాసవీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చిన్నగోపురం వీధిలోని కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. 102 మంది మహిళలు కలశాలతో వాసవీ అమ్మవారిని ఊరేగించారు. యడ్ల బజారులోని కనక దుర్గమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలను జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ ప్రారంభించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక  పందిళ్లలో అమ్మవారి పూజలు నిర్వహించారు. మండలంలోని అన్నిగ్రామాల్లోనూ శరన్నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.


కాళ్ళ : కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీలక్ష్మీ అమ్మవారిని ఆదిలక్ష్మిగా అలంకరించారు. శ్రీచక్ర అభిషేకం, కలశ స్థాపన, మండపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలక్ష్మీ అమ్మవారికి సహస్రనామ సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించారు.


పెనుగొండ: మండలంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అమ్మవార్ల ఆల యాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. పెనుగొండ వాసవి శాంతి ధామ్‌ క్షేత్రంలో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనం ఇచ్చారు. వాసవి కన్యకాపరమేశ్వరి, మహిషాసురమర్ధని అమ్మవార్లు బాలత్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చారు. మునమర్రులో ప్రత్యేకంగా అమ్మవారిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. వడలి తూర్పువీధి గౌడ సంఘం ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారి మండపాన్ని కొబ్బరి బొండాలతో విశేషంగా అలంకరించారు.


తాడేపల్లిగూడెం రూరల్‌: పట్టణం, మండలంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో బలుసులమ్మకు 108 కేజీల వెండి కవచాన్ని అలంకరించారు. విజయవాడ  దుర్గమ్మ ఆలయం నుంచి బలుసులమ్మకు అందించిన చీరను పట్టణంలో ఊరేగించారు. మహంకా ళమ్మను రజత కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. ముత్యాలమ్మకు వెండి త్రిశూలం, చీర సమర్పించారు. వీరంపాలెం బాలాత్రిపుర సుందరి దేవి పంచాయతన క్షేత్రంలో అమ్మవారికి శైలపుత్రి అలంకరణ చేశారు. ఆరుగొలను విజయదుర్గను ఘనంగా ఊరేగించారు.





Updated Date - 2022-09-27T05:10:35+05:30 IST